- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bandi Sanjay: బండి సంజయ్ కి బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేసిన న్యాయస్థానం

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కు భారీ ఊరట లభించింది. బండి సంజయ్ పై నమోదైన కేసును తాజాగా ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు (Nampally Court) కొట్టివేసింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా 2022 లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చారని బీఆర్ఎస్ నేతలు మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఇవాళ కేసును కొట్టివేసింది. ఈ పరిణామం బండి సంజయ్ కు ఊరటగా మారింది.
బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైర్:
మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక మలుపు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగింది. ఈ ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలైనా ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తుటాలు రాష్ట్ర రాజకీయాన్ని షేక్ చేశాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బీఆర్ఎస్ నేతలు సమాధి కట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ యూజ్ లెస్ ఫెలో, బీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.