Consumer Forum: విమానంలో తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ వస్తువులు గల్లంతు.. జరిమానా

by Prasad Jukanti |
Consumer Forum: విమానంలో తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ వస్తువులు గల్లంతు.. జరిమానా
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమానంలో వస్తువులు గల్లంతు అయిన విషయంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలైన ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్ కు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. రూ.3.72 లక్షల జరిమానా చెల్లించాలని ఈ రెండు సంస్థలను ఆదేశించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్సీ) చైర్మన్ రంగారావు గత జులైలో అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. అదే నెల 30వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి దోహా అటు నుంచి హైదరాబాద్ వచ్చేలా టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన బ్యాగులో విలువైన వస్తువుల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేయగా మీ వస్తువులు ఎక్కడా తప్పిపోకుండా తాము క్షేమంగా హైదరాబాద్ కు తీసుకువస్తామని ఇండిగో హామీ ఇచ్చింది. దీంతో వారి మాటలపై భరోసాతో 32 కేజీల బరువు కలిగిన బ్యాగులో రూ. 3.54 లక్షల విలువ కలిగిన బట్టలు, ఆహార వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికాలతో కూడిన బ్యాంగ్ ను వారికి అప్పగించారు. తీరా రంగారావు హైదరాబాద్ చేరుకునేసరికి ఆ తన బ్యాగ్ మిస్ అయింది. దీంతో ఈ ఘటనపై ఆయన వినియోగదారులను ఆశ్రయించగా దీనికి బాధ్యత వహించాల్సిన ఎయిర్ లైన్స్ కు జరిమానా విధించింది.

Advertisement

Next Story

Most Viewed