- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి..
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కమ్మెయ్యడంతో ప్రజల పనులకు ఆటాకంగా మారుతోంది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా చలి గాలుల ప్రభావం ఉందో తెలుసుకుందాం..
తెలంగాణ: ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన కుమురం భీమ్, మంచిర్యాల, జన్నారంలో వరుసగా 8, 8.7 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో రాబోయో 2 రోజుల్లో చలి వాతావరణం నెలకొనె అవకాశాలు ఉన్నాయంటూ.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింతా పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని.. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, తూర్పుగాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. అంతే కాకుండా గుంటూరు, నరసరావుపేటలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చలి, పొగమంచు పలు ప్రాంతాలు సుందర దృశ్యాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని టూరిస్టుల ప్లేసులకు పర్యాటకుల తాకిడి పెరిగింది.