మేడిగడ్డకు చేరుకున్న సీఎం బృందం

by Prasad Jukanti |
మేడిగడ్డకు చేరుకున్న సీఎం బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిది. హైదరాబాద్ నుంచి మంగళవారం బస్సుల్లో వచ్చిన సీఎం బృందానికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ బ్యారేజీలో కుంగిన పిల్లర్లు, బ్యారేజీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లారు. మరికాసేపట్లో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story