సచివాలయంలోని ఏడో అంతస్తులో సీఎం తొలి మీటింగ్

by GSrikanth |
సచివాలయంలోని ఏడో అంతస్తులో సీఎం తొలి మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాపాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నత అధికారులు, పలువురు మంత్రులతో ఆయన ఇవాళ సెక్రటేరియట్‌లోని ఏడో అంతస్తులోని హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైనే స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వనున్నారు.

100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలన యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చించడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయుల్లో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Next Story