పిల్లలు వచ్చారు.. అయినా బడి తలుపు తెరవలే..

by Rajesh |
పిల్లలు వచ్చారు.. అయినా బడి తలుపు తెరవలే..
X

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు రావట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు మేము చదువు బాగానే చెప్తున్నాం.. అని నిత్యం చెప్తుంటారు పంతుళ్లు.. నల్లగొండ పట్టణంలో ఓ పాఠశాల పరిస్థితి చూస్తే పంతుళ్ల పనితీరుకు అద్దం పడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ రోజు ఉదయం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో జేబీఎస్ హైస్కూల్( స్టార్ ఫంక్షన్ హాల్ సమీపంలో) విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కానీ సమయం ఉదయం 10గంటలు దాటిన సిబ్బంది బడి తలుపు తీయకపోవడంతో మెట్ల పైన కూర్చొని ఎప్పుడు బడి తలుపులు తీస్తారా పంతులు వచ్చి ఎప్పుడు చదువు చెప్తారా... అంటూ ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు ఉండే పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల పనితీరు ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతమైన దేవరకొండ లాంటి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యం పంతుల పనితీరుకు ఈ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. సమయ పాలన పాటించకుండా పిల్లలే పంతుళ్ల కోసం ఎదురుచూసేందుకు కారణమైన బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed