- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్.. పోలింగ్ రోజు హాలీ డే
దిశ, తెలంగాణ బ్యూరో: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట్ జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు లభించనున్నది. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఈసీ నిబందనలు లేవని వివరించిన సీఈఓ ఆఫీస్... ఓటు వేసేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించింది.