జర్నలిస్ట్ రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి: తెలంగాణ జర్నలిస్టు ఫోరం డిమాండ్

by Satheesh |
జర్నలిస్ట్ రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి: తెలంగాణ జర్నలిస్టు ఫోరం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టు రేవతిపై పోలీసులు కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్.. ఆమెకు మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించింది. తక్షణమే ఆమెపై కేసును ఉపసహరించుకోవాలని ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేసింది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం వెంటనే స్పందించి డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ప్రజా సమస్యలపై స్పందించడం, గొంతు విప్పడమే జర్నలిస్టుల వృత్తిధర్మమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం వారి బాధ్యత అని ఫోరమ్ ప్రెసిడెంట్ పల్లె రవికుమార్ గౌడ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహేశ్వరం మహేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వ్యక్తిగత స్వార్థం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశ్యంతోనే జర్నలిస్ట్ రేవతి ఒక మహిళా విద్యుత్ వినియోగదారు ఎదుర్కొన్న సమస్యను ప్రస్తావించారని గుర్తుచేశారు. సమస్య తీవ్రతను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారని, సమస్యను గుర్తించి పరిష్కారించాల్సిన దక్షిణ డిస్కం అధికారులు ఆమెను టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని, కారణాలను అన్వేషించి పునరావృతం కాకుండా చూడాలని, కానీ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపినందుకు రేవతిపై కేసులు పెట్టడం సమంజసం కాదని నొక్కిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed