- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభమైన తెలంగాణ కేబినేట్ సమావేశం.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినేట్ గురువారం భేటీ అయ్యింది. ఇటీవల ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మొదటిసారి జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావొస్తున్నా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 2 నుంచి 21 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనుండగా.. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లపై కేబినేట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక దళిత బంధు, గృహలక్ష్మీతో పాటు ఇతర పథకాలకు సంబంధించిన చర్చ కూడా జరగునుందని సమాచారం. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై కూడా ఈ భేటీలో డిస్కషన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం.
Also Read..
కేసీఆర్ ప్రభుత్వంపై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నలుగురు ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి