- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభమైన బొగ్గు గనుల వేలం.. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. వెస్ట్ ఇన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. శ్రావణ పల్లి గనిని సింగరేణికే ఇవ్వాలని అన్నారు.
దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి ఈ వేలం వేస్తున్నామని, మార్కెట్‌లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తెలంగాణలో పరిస్థితులు కిషణ్ రెడ్డికి బాగా తెలుసని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాలతో సింగరేణి సంస్థ రెండు సార్లు వేలంలో పాల్గొనలేదని గుర్తుచేశారు.