Minister : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

by Kalyani |
Minister : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, సికింద్రాబాద్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అన్ని రంగాల కన్నా వైద్య వృత్తి మానవత్వం తో కూడిన గొప్ప వృత్తి అని కొనియాడారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పట్ల సమాజంలో ఉన్న భావన తొలగిపోయి, ఐఏఎస్, ఐపీఎస్ లు సైతం వైద్య సేవల కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చేలా సేవలను మెరుగుపరచాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ను ప్రారంభించి, నూతన హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూడాల సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల్లో రూ,200 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం దాదాపు ఆరేళ్లుగా గాంధీ ఆసుపత్రిలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఐవిఎఫ్ సెంటర్ను గాంధీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ తీసుకొలేని పేద మహిళలకు తల్లి కావాలనే ఆకాంక్ష నెరవేరాలన్నారు. రానున్న 15 రోజుల్లో పేట్ల బురుజు మెటర్నల్ ఆసుపత్రిలో కూడా మరో ఐవిఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీంతోపాటు సుల్తాన్ బజార్లో ఐవీఎఫ్ సెంటర్ ను ప్రారంభించాలని ఎల్ సెక్రెటరీ ఆదేశించడం జరిగిందన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ లో సుమారు 32 ఎకరాలలో రూ,200 కోట్లతో నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడున్న 32 సూపర్ స్పెషాలిటీ శాఖలతోపాటు మరిన్ని సూపర్ స్పెషాలిటీలను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్​ కుమార్​ యాదవ్​, ఎమ్మెల్సీ రియాజ్​, హెల్త్​ సెక్రటరీ క్రిస్టినా జడ్​ చోంగ్తూ, డీఎంఈ డా.ఎన్​.వాణీ, హెచ్​ఎమ్​ ఆండ్​ ఎఫ్​ డబ్ల్యూ కమిషనర్ ఆర్​వీ కర్ణన్​, టీజీఎమ్​ఎస్​ ఐడీసీ ఎండీ హెమంత్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే. ఇందిర, సూపరింటెండెంట్​ ప్రొఫెసర్​ రాజకుమారి, ఆర్​ఎంవో వన్​ డా.శేషాద్రి, డాక్టర్లు, జూడా యూనియన్​ నాయకులు, మెడికల్ స్టూడెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed