- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధాప్య ఛాయలను దూరంగా ఉంచుతున్న ప్రయాణాలు.. ఈ టిప్స్ పాటిస్తే యవ్వనం మీ సొంతం..
దిశ, ఫీచర్స్ : ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ అధ్యయనం వృద్ధాప్యాన్ని శరీరంలో పెరుగుతున్న రుగ్మతగా పేర్కొంది. కొత్త అనుభవాలను పరిచయం చేయడం, సామాజిక పరస్పర చర్యలను ప్రోత్సహించడం, స్థిరమైన శారీరక శ్రమలో పాల్గొనడంతోపాటు ముఖ్యంగా ప్రయాణం వాస్తవానికి ఈ వృధ్యాప్య ఛాయలను తగ్గిస్తుందని తెలిపింది. ఇంతకీ జర్నీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ విధంగా యాంటీ ఏజింగ్ కు హెల్ప్ చేస్తుంది? ఆరోగ్యకరమైన, యవ్వన జీవనశైలికి ఏ విధంగా సాయపడుతుంది? తెలుసుకుందాం.
ప్రయాణం ప్రయోజనాలు
ఒత్తిడి తగ్గింపు: అడవులు లేదా బీచ్‌లు వంటి కొత్త వాతావరణాల్లో ఎంజాయ్ చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.
శారీరక దృఢత్వం: ట్రావెలింగ్ తరచుగా వాకింగ్, హైకింగ్, సైక్లింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని, కండరాల బలాన్ని, మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
సామాజిక పరస్పర చర్య: కొత్త వ్యక్తులను కలుసుకోవడం, స్థానికులు, తోటి ప్రయాణికులతో మాట్లాడటం.. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు, ఒంటరితనం భావాలను తగ్గించవచ్చు. అభిజ్ఞా పనితీరును ఇంక్రీజ్ చేయవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం: కొత్త, తాజా, స్థానిక ఆహారాలను అన్వేషించడానికి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి ప్రయాణం హెల్ప్ చేస్తుంది.
వెల్నెస్, రిలాక్సేషన్: అనేక ప్రయాణ గమ్యస్థానాలలో కనిపించే వెల్నెస్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాలు శారీరక, మానసిక శ్రేయస్సుకు తోడ్పడతాయి.
పునరుజ్జీవనం కోసం చిట్కాలు..
- యూనిక్ యాక్టివిటీస్ లో ట్రై చేయండి. వాటిలో పూర్తిగా నిమగ్నమై ఆస్వాదించండి.
- స్థానికులతో వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి మాట్లాడండి. వాటిని ట్రై చేసేందుకు ప్రయత్నిస్తూ ఆనందించండి.
- జర్నీలో ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోండి. ఇలాంటి ప్లాన్ హెల్తీగా ఉంచుతుంది.
- ఆరోగ్యకరమైన లోకల్ ఫుడ్స్ తీసుకోండి. శరీరానికి పోషకాలను అందించండి.
- డిజిటల్ వరల్డ్ (ఫోన్,ల్యాప్ టాప్, సోషల్ మీడియా) నుంచి డిస్ కనెక్ట్ అయ్యి..ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయండి.