డేటింగ్ యాప్‌లలో అమ్మాయిలకు వల.. చిక్కిన నిందితుడు

by Ramesh N |
డేటింగ్ యాప్‌లలో అమ్మాయిలకు వల.. చిక్కిన నిందితుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డేటింగ్ యాప్‌లో యువతులకు వల విసిరి పెళ్లి చేసుకుంటానని మోసాలు చేస్తున్న సైబర్ నేరగాడు అరెస్ట్ అయ్యాడు. నంద్యాల జిల్లా సంజమాల మండలానికి చెందిన చిన్ని రెడ్డి శ్రీనాథ్‌ రెడ్డిని తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టిండర్, నీతో డేటింగ్ అనే డేటింగ్ యాప్‌‌ల ద్వారా యువతులకు నిందితుడు పరిచయం అయ్యేవాడు. యాప్ డెవలపర్ అంటూ స్నేహం చేసి.. అనంతరం వివాహం చేసుకుంటానని చాటింగ్‌ స్టార్ట్ చేస్తాడు. దీంతో యువతులు శ్రీనాథ్‌ను నమ్మి తమ వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసేవారు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవాడు.

ఇటీవల నగరానికి చెందిన బాధితురాలి నుంచి శ్రీనాథ్‌ రెడ్డి రూ. 6.41లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మోసాలతో వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌కు నిందితుడు ఆ వినియోగిస్తాడు. నిందితుడిపై గతంలో సైబరాబాద్‌లో మరో కేసు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు నిందితుడి నుంచి సెల్‌ఫోన్, రెండు సిమ్‌ కార్డ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed