- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లీకేజీ బాధ్యత రాష్ట్ర సర్కారుదే.. కేసీఆర్ రాజీనామా చేయాలి: ABVP
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ చేసిన ద్రోహులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజాం కాలేజీ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా గోల్కొండ జిల్లా కన్వీనర్ శ్రావణ్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీలో ప్రశ్న పత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా బోర్డు చైర్మన్‌ను తొలగించాలని మండిపడ్డారు. బోర్డుని మొత్తం ప్రక్షాళన చేయాలని, మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రశ్న పత్రాలు లీకేజీ చేసి అమ్ముకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ డిమాండ్స్‌ను వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజులో ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించాలి. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శ్రావణ్, వైస్ ప్రెసిడెంట్ శివరాజ్, నవీన్, అన్వేష్, ధనరాజ్, శ్రీధర్, శ్రీవల్లి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.