- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
24 గంటల నిబంధన అన్ని షాపులకు వర్తించదు
దిశ/ తెలంగాణ క్రైం బ్యూరో: 24/7 దుకాణాలు తెరిచి పెట్టుకోవచ్చన్న నిబంధన అన్ని షాపులకు వర్తించదని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ముఖ్యంగా ఈ ఉత్తర్వులు ఎక్సయిజ్ శాఖకు వర్తించవని స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో 24/7 దుకాణాలు తెరిచి ఉంచే నిబంధనలు అమల్లో ఉన్నట్టు చెప్పారు. ఈనెల 4న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్ర షాప్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్1988 పరిధికి లోబడి అమలవుతాయని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే దుకాణాదారులు అందుకు అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎక్సయిజ్చట్టాలను అనుసరించి టీఎస్బీబీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, బ్రూవరేజీలు, వైన్‌షాపులు, బార్లు ఇప్పటికే నిర్ణయించిన ప్రత్యేక బిజినెస్సమయం ప్రకారమే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు.