Dr. Thatikonda Rajaiah : తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

by Gantepaka Srikanth |
Dr. Thatikonda Rajaiah : తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. కేసీఆర్(KCR) హయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండేదని గుర్తుచేశారు. హెలీకాఫ్టర్లలో ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సామగ్రి తరలించామని అన్నారు. కానీ, ప్రస్తుత ప్రజా పాలనలో ‘గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు’ ఉందని మండిపడ్డారు. ఇది ప్రజాపాలనా? లేక ఎమర్జెన్సీ పాలనా? అనేది రేవంత్ రెడ్డి(Revanth Reddy) క్లారిటీ ఇవ్వాలని అన్నారు. గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) సందర్శనకు తాము వెళితే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు. ప్రజలకు ముఖ్యమైనవి విద్య, వైద్యం అని అన్నారు. ఆ రెండింటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెట్టిస్తున్న ఘనత రేవంత్ ప్రభుత్వానిదని విమర్శించారు. విద్యార్థులు తమకు సౌకర్యాల కోసం ధర్నా చేస్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ జిల్లా కో మెడికల్ కాలేజీ తెచ్చారు. పుట్టబోయే బిడ్ద నుంచి చనిపోయే దాకా కేసీఆర్ హయంలో అనేక పథకాలు ఉండేవి. ఇపుడు కేసీఆర్ కిట్ లేదు.. న్యూట్రిషన్ కిట్ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే తాము ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శనకు వెళ్లాలనుకున్నామని అన్నారు. నియంత పోకడలతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను అణిచివేస్తోందని మండిపడ్డారు.

Next Story

Most Viewed