- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ex CM Jagan : అందుకే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం.. మాజీ సీఎం జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా.. లేక రివర్స్‌లో వెళ్తోందా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సి అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని.. అయితే బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అయినా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు.
సాధారణ బడ్జెట్ పెడితే హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని.. హామీలకు నిధులు కేటాయించకపోతే ప్రజలు రోడ్డెక్కుతారనే భయంతోనే చంద్రబాబు పూర్తి బడ్జెట్ పెట్టడం లేదన్నారు. చంద్రబాబుది వంచెన, గోబెల్స్ సిద్ధాంతం అన్నారు. హామీలు ఇవ్వడం, మోసం చేయడం చంద్రబాబుకు అలావాటు అని అందుకే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు సాకులు చెప్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు ప్రచారం చేశారని లేనిది ఉన్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అప్పులను బడ్జెట్‌లో చూపించలేక పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు.