- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోల్ చార్జీల పెంపుతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. పురుషులపై పడనున్న భారం!
దిశ, డైనమిక్ బ్యూరో: టోల్ చార్జీల పెంపుతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని హైవేలపై నడిచే బస్సు చార్జీలను పెంచినట్లు తెలిసింది. ఇటీవలే జాతీయ రహదారులపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు 5 శాతం మేర పెరిగాయి. ఈ నేపధ్యంలోనే తెలంగాణలో హైవేలపై నడిచే బస్సు చార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. హైవేలపై తిరిగే బస్సులు కూడా టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉండటంతో బస్ చార్జీలు కూడా 3 రూపాయల చొప్పున పెంచినట్టు తెలుస్తోంది. అటు కేంద్రం టోల్ చార్జీలు పెంచడంతో తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులపై భారం పడ్డట్టు అయ్యింది.
ప్రతీ బస్ టికెట్ పై రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంబందింత వర్గాలు వెల్లడించాయి. టోల్ చార్జీల పెంపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టీజీఎస్ఆర్టీసీ ఎలాంటి ప్రకటన వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైవేలపై తిరిగే ప్రతీ బస్ టికెట్ పై మూడు రూపాయల చొప్పున పెంచడంతో ఆర్టీసీకి కూడా అధనపు ఆదాయం చేకూరనుంది. అయితే ఈ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా పెంచితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే మహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుండటంతో పెంచిన చార్జీల భారం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులపై పడనుంది.