TGSRTC: ప్రయాణికురాలిపై కండక్టర్ వేధింపులు.. ట్విట్టర్ ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్

by Ramesh Goud |
TGSRTC: ప్రయాణికురాలిపై కండక్టర్ వేధింపులు.. ట్విట్టర్ ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్ వేధిపులకు గురి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. దీనిపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆ మహిళ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇందులో మహిళ తీసుకున్న టికెట్ తో పాటు బస్ కండక్టర్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీనిపై ఆ మహిళ.. ప్రజారవాణాలో నేను అనుభవించిన భయంకరమైన వేధింపుల సంఘటన ఇది.. ఈ నెల 23వ తేదీన జడ్చర్ల నుంచి హైదరాబాద్ కు టీజీఎస్ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ (TS07UG6541) నంబర్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్ తనతో దురుసుగా ప్రవర్దించాడని, అనుచితంగా తాకాడు అని ఆరోపణలు చేసింది.

అంతేగాక అతను ఎంతమందికి ఇలా చేసి తప్పించుకున్నాడో ఊహించుకోండి అంటూ.. ఇంతమంది ప్రయాణికులు ఉన్న పబ్లిక్ బస్సులో ఓ ప్రభుత్వోద్యోగి ఇలా చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని టీజీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ పోలీసులు పరిశీలించాలని కోరింది. అయితే మహిళ ఆరోపణలపై ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హైదరాబాద్ సిటీ పోలీసులు రిప్లై ఇస్తూ.. ఈ అంశాన్ని అఫ్జల్ ఘంజ్ ఎస్‌హెచ్ఓ వద్ద ఉంచామని, మీరు వారిని సంప్రదించాలని చెప్పారు. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ అంశంపై పూర్తిగా దర్యాప్తు జరిపించి, నిజాలు తేలిన తర్వాతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఒక వేళ తప్పుడు ఆరోపణలు చేస్తే.. ఫిర్యాదు చేసిన మహిళపై కూడా చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed