TGS RTC: ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్‌కు రైట్ రైట్..! అందుబాటులోకి 10వేల ఐ-టిమ్ మెషీన్లు

by Shiva |   ( Updated:2024-08-16 09:04:19.0  )
TGS RTC: ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్‌కు రైట్ రైట్..! అందుబాటులోకి 10వేల ఐ-టిమ్ మెషీన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు TGS RTC చక్కని శుభవార్త చెప్పింది. ఈ మేరకు బస్సులో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ రిజీయన్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోందని టీడీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయితే, కండక్టర్లను చిల్లర బాధ నుంచి విముక్తులను చేసేందుకు మరి కొద్దిరోజుల్లోనే అన్ని డిపోల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని తీసుకొస్తామని అన్నారు. ఈ మేరకు ఉద్యోగులందరికీ 10వేల ఐ-టిమ్ మెషీన్లను ఇవ్వబోతున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రయాణికులు బస్సుల్లో నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చని అన్నారు.

మహిళలకు స్మార్ట్ కార్డులు

ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రస్తుతం మహిళలు తమ అధార్ కార్డులను చూపించి బస్సుల్లో జీరో టికెట్లను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధార్‌కు ఆ స్మార్ట్‌ కార్డును లింక్ చేయనున్నారు.

Advertisement

Next Story