బ్రేకింగ్: TGPSC సంచలన నిర్ణయం.. పేపర్ లీకేజీ కారణంగా మరో పరీక్ష రద్దు

by Satheesh |   ( Updated:2024-07-19 15:04:13.0  )
బ్రేకింగ్: TGPSC సంచలన నిర్ణయం.. పేపర్ లీకేజీ కారణంగా మరో పరీక్ష రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కారణంగా మరో పరీక్షను రద్దు చేసింది. ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు తాజాగా టీజీపీస్సీ ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్పీ సెక్రటరీ నికోలస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నివేదిగా ఆధారంగా ఈ పరీక్షను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ నియామక పరీక్షను తిరిగి మళ్లీ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రవేశ పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కాగా, గతేడాది జనవరి 3, 8వ తేదీల్లో ఈ పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల పేపర్లు లీకైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపగా.. లీకేజీ ఇష్యూపై విచారణకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. పేపర్ లీకేజీపై దర్యాప్తు చేపట్టిన సిట్ పలు ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైనట్లు నిర్ధారించింది. ఇందులో భాగంగానే ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ నియామక పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకైనట్లు గుర్తించి టీజీపీఎస్సీకి రిపోర్ట్ ఇవ్వగా.. దాని ఆధారంగా టీజీపీఎస్సీ ఈ పరీక్షను క్యాన్సిల్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed