TG Police: జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి కేసు.. పోలీసుల కీలక ప్రకటన

by Shiva |
TG Police: జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి కేసు.. పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్ట్‌ (Journalist)పై నటుడు మోహన్ బాబు (Mohan Babu) దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా పోలీసులు మరో కీలక ప్రకటన చేశారు. తాము ఇప్పటి వరకు కేసుకు సంబంధించి మోహన్ బాబు (Mohan Babu) స్టేట్‌మెంట్‌ను తీసుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారని పేర్కొన్నారు. ఆయన వద్ద లైసెన్డ్స్ గన్ (Licensed Gun) వెంటనే అప్పగించాలని కోరగా.. విచారణ సమయంలో హ్యాండోవర్ చేస్తారని మోహన్ బాబు (Mohan Babu) చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం తెలియదని పోలీసులు తెలిపారు. అయితే, తాను పరారీలో లేనని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని, మరో రెండు రోజుల్లో విచారణకు వస్తానంటూ నిన్న మోహన్ బాబు (Mohan Babu) ట్విట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆయన గన్‌ను సీజ్‌ చేసేందుకు పోలీసుల యత్నించారు.

కాగా, హైదరాబాద్‌ (Hyderabad)లోని జల్‌పల్లి (Jalpally)లో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీతో మనోజ్ (Manoj) వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ.. ఓ జర్నలిస్టు (Journalist)పై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తీసుకుని తాజాగా ఆయనపై BNS 109 సెక్షన్ కింద హత్యాయత్న కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed