TG Govt.: కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం.. సర్కార్ సంచలన నిర్ణయం!

by Shiva |
TG Govt.: కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం.. సర్కార్ సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: అలకనంద కిడ్నీ రాకెట్ (Alakananda Kidney Racket Case) కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 8 మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కిడ్నీ దాతలు తమిళనాడు (Tamilnadu)కు చెందిన వారిగా, గ్రహీతలు బెంగళూరు (Bengaluru)కు చెందిన వారిగా ప్రాథమిక విచారణలో తేలింది. గత 6 నెలలుగా అలకనంద ఆస్పత్రి (Alakananda Hospital)లో కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 లక్షలకు పైగానే వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేసును సీఐడీ (CID)కి బదిలీ చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. అయితే, ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodara Raja Narsimha) చర్చించారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

Next Story

Most Viewed