TG Govt.: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. ‘రైతు భరోసా’పై నేడు కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

by Shiva |   ( Updated:2025-01-02 03:43:25.0  )
TG Govt.: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. ‘రైతు భరోసా’పై నేడు కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) తరువాత రాష్ట్రంలో ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committe) సమావేశం కానుంది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy), శ్రీధర్ బాబు (Sridhar Babu) సభ్యులుగా ఉన్నారు.

నేటి సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా (Raithu Bharosa) విధివిధానాలపై కీలక చర్చ జరగనుంది. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక సాయం, పంట నష్ట పరిహారం, వ్యవసాయ రంగానికి మద్దతు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. రైతు భరోసాకు కటాఫ్ ఎంత పెట్టాలి, ఎన్ని ఎంత సీలింగ్ ఉండాలి, కౌలు రైతులను ఆదుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే, సంక్రాంతి (Sankranthi)కి ముందే రైతు భరోసా నిధులను విడుదల చేసే యోచనలో సర్కార్ ఉండటంతో నేటి సమావేశంలోనే విధివిధానాలను ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గురుకులాల్లో విద్యార్థులకు అందించే మెనూపై కూడా ఈ భేటీలో సమీక్షించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null