- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారు.. హరీష్ రావు హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారని, నమ్మించి గద్దెనెక్కి గద్దల్లా మారిపోయారని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. కేబినెట్ భేటీ(Cabinet Meeting) అనంతరం రైతు భరోసా(Raithu Bharosa)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటన చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అలాగే ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడైతే 10,000, మాకు ఓటేస్తే 15,000 అని ఊరించిండు అని, నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని, గద్దెనెక్కినాంక గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన క్యాబినెట్ ద్వారా రైతుల ఆశలను అడియాసలు చేశారని.. రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారని అన్నారు.
రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో 7,500 చొప్పున ఇస్తామని చెప్పి, 6,000 కు కుదించారని, కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట అని, మోసానికి పర్యాయపదం రేవంత్ రెడ్డి అనేది ఈరోజు నగ్నంగా బయటపడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కేసీఆర్(KCR) మానస పుత్రిక, ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుందని అన్నారు. భూమి కలిగిన రైతులకే కాదు, కౌలు రైతులకు సైతం రెండు సీజన్లలో కలిపి రూ.15,000 పంట పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రమాణం చేశారని గుర్తుచేశారు. క్యాబినెట్ లో ఆ విషయమే చర్చించలేదని, కౌలు రైతుల గుండెల్లో గుద్ది, దారుణంగా ధోకాకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఇక వాన కాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితోపాటు కలిపి ఎకరానికి రూ.15,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా అదొక చిల్లర నాటకంగా మార్చేశారని, బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగస్ గానే మిగిలిపోయిందని, పంట బీమా పత్తా లేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని, నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ కు తగిన సమయంలో బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు.