Good News: తెలంగాణ కేబినెట్ గుడ్ న్యూస్.. ఆ శాఖలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

by Prasad Jukanti |   ( Updated:2025-01-04 13:46:33.0  )
Good News: తెలంగాణ కేబినెట్ గుడ్ న్యూస్.. ఆ శాఖలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల (Karunya Niyamakalu) కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఆర్ఆర్డీ శాఖ‌లో (PRRD Department) 588 కారుణ్య నియామ‌కాల‌కు కేబినెట్ (TG Cabinet) ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఈ భేటీలో పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద దాదాపు 550కి పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఆ శాఖ గతంలోనే ఫైల్ సిద్ధం చేయగా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అప్పుడే అంగీకరించింది. ఇవాళ జరుగుతున్న కేబినెట్‌లో ఈ ఫైల్‌కు ఆమోదముద్ర వేసింది. అర్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో కారుణ్య నియామకాలు చేపట్టబోతున్నది.

Advertisement

Next Story