TG Budget 2024 : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.. మొత్తం బడ్జెట్ ఎంతంటే..?

by Rajesh |
TG Budget 2024 : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.. మొత్తం బడ్జెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రూ.2,91,159 కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూల ధన వ్యయం రూ.30,487 కోట్లుగా తెలిపారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ.3050 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రూ.1500కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, వైద్యం, ఆరోగ్యం రూ.11,468 కోట్లు కేటాయించారు. ఐటీ రంగానికి రూ.774 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ఆర్ అండ్ బీకి రూ.5,790 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు కేటాయించారు. ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, అడవులు, పర్యావరణం రూ.1064 కోట్లు కేటాయించారు.

Advertisement

Next Story

Most Viewed