TG Budget-2024 : మహిళలకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్.. మరో పథకం ప్రకటించిన ప్రభుత్వం

by Sathputhe Rajesh |
TG Budget-2024 : మహిళలకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్.. మరో పథకం ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ‘మహాలక్ష్మీ’ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలకు మరో పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 63 లక్షల మంది మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా రూ. లక్ష కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తామని అనౌన్స్ చేసింది.

ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లలో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5వేల గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరే విధంగా కార్యచరణ చేపట్టి, రాబోయే ఐదేళ్లో 25వేల సంస్థలకు విస్తరించడానికి కృషి చేస్తామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed