- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG Assembly: ఓట్లకు ముందు అభయహస్తం.. ఓట్ల తరువాత శూన్యహస్తం: అసెంబ్లీలో కేటీఆర్ సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: ఓట్లకు ముందు అభయహస్తం.. ఓట్ల తరువాత శూన్యం హస్తంలా ప్రభుత్వ పనితీరు ఉందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏడో రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను తక్కువ చేసి చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాము అప్పులపాలు చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు.. గత కాంగ్రెస్ పాలనపై తామెందుకు మాట్లాడకూదని ప్రశ్నించారు.
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సమర్ధవంతంగా పని చేస్తుందని అన్నారు. మంచి నిర్ణయాలకు ఎప్పుడూ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దుతు ఉంటుందని తెలిపారు. విపక్షంలో ఉన్న నాడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రామార్క ప్రశంసించారనే విషయాన్ని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి రాాగానే ఆయన కూడా మాట మార్చారని ఆరోపించారు. త్వరలోనే భట్టి కూడా ముఖ్యమంత్రి సీటులోకి వెళ్లాలని కోరుకుంటున్నా అంటూ కేటీఆర్ చమత్కరించారు.