TG Assembly : BRSకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-27 06:41:26.0  )
TG Assembly : BRSకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సంచలన సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ నాయకులు విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల పథకంలో రూ.700 కోట్లను స్వాహా చేశారన్నారు. బతుకమ్మ చీరల విషయంలో దోపిడీ జరిగిందన్నారు.

కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నారు. గతంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్మేశారన్నారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పలేదన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7కోట్లకు అమ్మారని గులాబీ పార్టీపై మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు తీరువల్లే కేంద్ర బడ్జెట్‌లో ఒక్క పైసా రాలేదని ఆరోపించారు.

TG Assembly : అసెంబ్లీలో హరీష్ రావు Vs కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Next Story