- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్..
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా.. రైతు రుణమాఫీతో పాటు గృహ జ్యోతి పథకాలపై అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు సంధించిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రి శ్రీధర్ బాబు సమాధానం తమదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతండగానే బీఆర్ఎస్ (BRS) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం ప్రసంగాన్ని తాము బాయ్‌కాట్ (Boycott) చేస్తున్నట్లుగా కామెంట్ చేశారు. తమ అధినేత కేసీఆర్ (KCR)పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Next Story