- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG: కేటీఆర్ పాదయాత్రకు వెల్‌కమ్ అంటూనే ఎంపీ సెటైర్స్

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ పాదయాత్రను వెల్ కమ్ చేస్తున్నామని, రోడ్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేళ్లు బయటకు రాకుండా ఇప్పుడు బయటకు రావడం మంచిదేనన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ మద్దతు ఉన్నందునే కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ సమావేశానికి వెళ్ళారన్నారు. డిలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ను పొగుడుతున్నారని, కానీ అంతకు ముందే లేఖలు రాసిన జానారెడ్డి, భట్టి నీ పొగడటానికి కేటీఆర్ కు నోరు రావడం లేదని ఎంపీ విమర్శించారు. శనివారం అసెంబ్లీలో మీడియా పాయింట్ లో మాట్లాడుతూ నితిన్ గడ్కరీ నీ కలసి ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ క్యాబినెట్ లో పెట్టాలని కోరినట్లు తెలిపారు. మెట్రో విస్తరణ మీద కేంద్రానికి లేఖలు రాశామని, పదేళ్ళ గత ప్రభుత్వం మెట్రో ను పట్టించుకోలేదన్నారు. కిషన్ రెడ్డి నీ కేంద్ర మంత్రిగా మాత్రమే కాదని, బీజేపీ అధ్యక్షుడిగా చూడాలని, ఇక్కడ బీజేపీ బలోపేతం చేసుకోవాలని, సీఎం అవ్వాలని ఆయనకి ఉంటుందని అభిప్రాయపడ్డారు. నిధులు ఇస్తే కాంగ్రెస్ క్రెడిట్ కిట్టేస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇన్ని సార్లు డిల్లీకి వెళితే, ఎవరు తెలంగాణ నిధులు అడ్డుకుంటున్నారునే విషయం తెలిసిందన్నారు. కొత్త ప్రభుత్వానికి కనీసం మూడేళ్ల సమయం ఇవ్వాలన్నారు, జన గణన 2026 లో జరిగితే, డీలిమిటేషన్ 2027 లో జరుగుతుందన్నారు. దొంగలు పడక ముందే అలెర్ట్ అవుదామని స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. డీలిమిటేషన్ సమావేశాన్ని కేంద్ర మంత్రి సంజయ్ చిల్లరగా మాట్లాడుతున్నారు. దొంగల ముఠా అనుకుంటే పోలీసులను హోమ్ శాఖ సహాయ మంత్రి ఎందుకు పంపడం లేదన్నారు. బండి సంజయ్ కి అప్పుడప్పుడు కేంద్ర మంత్రి అని గుర్తు చేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు పక్కన పెట్టీ అందరు కలసి నడవాలని, అసెంబ్లీ లో బడ్జెట్ మీద చర్చ చేయకుండా, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ మూసీ ప్రక్షాళన కోసం కేంద్రాన్ని కోరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజకీయాలు చేయడం వేరు.. అభివృద్ధి వేరు అని, ఈ విషయంలో ఈటెల రాజేందర్ గారిని ఒప్పుకోవాలన్నారు. హరీష్ రావు కూడా పాజిటివ్ లైన్ లోకి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అందరికీ సీఎం అని గ్రహించి, సమస్యల పరిష్కారానికి సీఎంను కలిశారన్నారు.