TG Assembly: ప్రజా‌భవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి.. ఆ ప్రతులకు ప్రత్యేక పూజలు

by Shiva |   ( Updated:2025-03-19 04:30:08.0  )
TG Assembly: ప్రజా‌భవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి.. ఆ ప్రతులకు ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా ఆరో రోజు కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇవాళ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రజాభవన్ (Praja Bhavan) ఆవరణలోని నల్ల పోచమ్మ ఆలయం (Nalla Pochamma Temple)లో అమ్మవారి ముందు బడ్జెట్ ప్రతులను (Budget Copies) పెట్టి సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారికి వేద పండితలు ఆశీర్వచనం ఇచ్చారు. అక్కడి నుంచి మల్లు భట్టి విక్రమార్క నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాలు (Assembly Committe Hall)లో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఆ భేటీలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపాక.. ఉదయం 11.02 నిమిషాలకు ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టనున్నారు.

Next Story

Most Viewed