నీలం వర్సెస్ కాటా.. నామినేషన్ వేళ పటాన్ చెరులో హై టెన్షన్

by Satheesh |   ( Updated:2023-11-10 11:36:21.0  )
నీలం వర్సెస్ కాటా.. నామినేషన్ వేళ పటాన్ చెరులో హై టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజులు ఒకే సమయంలో తమ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం భారీ ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకే సారి రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని కంట్రోల్ చేశారు. అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ కాటా శ్రీనివాస్, నీలం మధు ఆర్వో కార్యాలయంలోపలికి వెళ్లి నామినేషన్లు వేశారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరు ప్రకటించినప్పటికీ బీ ఫామ్ మాత్రం కాటా శ్రీనివాస్‌కు ఇచ్చింది. దీంతో ఇవాళ ఉదయమే నీలం మధు బీఎస్పీలో చేరి బీఫామ్ అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed