- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: నాంపల్లి బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లిలోని బీజేపీ ఆఫీసును ఆప్ కార్యకర్తలు ముట్టడించారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుకు నిరసనగా ఈడీ, సీబీఐ డౌన్ డౌన్ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని ఆప్ కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.
పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఆప్ కార్యకర్తలు సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మద్యం అమ్మకాలకు సంబంధించి రద్దు చేసిన పాలసీలో అవినీతికి సంబంధించి సీబీఐ 8 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సిసోడియాను అరెస్టు చేసింది. ఆప్ నిరసనల దృష్ట్యా దేశ రాజధాని నగరంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.