- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీసులపై చేయి చేసుకున్న YS షర్మిల.. కేసు నమోదు (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను ఇంటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు బయటకు వెళ్లకుండా ఆపుతున్నారో చెప్పాలంటూ వైఎస్ షర్మిల అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులపై తిరగబడ్డారు. కొందరు పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. పోలీసులతో.. తనను వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులను నెట్టుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల యత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా లోటస్ పాండ్ వద్ద భారీగా మొహరించి షర్మిల కారు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా ఆమెపై కేసు నమోదు చేశారు.
Next Story