TS: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత

by GSrikanth |
TS: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నించారు. శనివారం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు 40 మంది మహిళా నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story