- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!
దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకంటే ఎక్కువ టెంపరేచర్ నమోదైంది. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బుధవారం 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలోని ఖానాపూర్, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 45.4 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలోని మామిళ్లగూడెం, నల్లగొండ జిల్లాలోని నిడమానూరులో 45.2 డిగ్రీల చొప్పున టెంపరేచర్ నమోదైంది. మరో ఐదు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్ని చోట్ల స్వల్పంగా పెరిగే అవకాశముందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గతేడాది ఇదే సమయానికి గరిష్టంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదైందని, ఈ సంవత్సరం నాలుగు డిగ్రీలు పెరిగిందని బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వాతావరణ కేంద్రం పేర్కొన్నది. వాయువ్య దిశ నుంచి తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయని, ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రభావం ఉంటుందని వివరించింది. ఐదు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని, గాలిలో తేమ 50% కంటే తగ్గినందున పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో టెంపరేచర్ రానున్న రెండు రోజుల్లో పెరగనున్నట్లు పేర్కొన్నది.