తెలంగాణ తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మృతి

by Sathputhe Rajesh |
తెలంగాణ తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మృతి
X

దిశ, ప్రతినిధి నిర్మల్: తెలంగాణ రాష్ట్ర తొలి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌గా సేవలు అందించిన డాక్టర్ చంపా నాయక్ (67)గురువారం ఉదయం కన్నుమూశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఛంపా నాయక్ 1986లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో పి‌హెచ్‌సీ వైద్యాధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. హస్నాపూర్, దంతన్ పల్లి, జైనూర్, నార్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందించారు.

కొంతకాలం ఉట్నూరు గిరి వికాస కిరణం మొబైల్ వైద్యుడిగాను పనిచేశారు. ఆ కాలంలో ఆయన తన సేవలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల మన్ననలు చూరగొన్నారు. ఆ తర్వాత అదనపు డీఎం‌హెచ్ వో‌గా పదోన్నతి పొందారు. నల్లగొండ జిల్లా డీఎంహెచ్‌ఓ‌గా పనిచేసిన ఆయన అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌గా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed