- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
షిర్డీ యాత్రికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో: షిర్డీ యాత్రికులకు తెలంగాణ పర్యాటక శాఖ శుభవార్త తెలిపింది. షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి చౌక ధరలో ప్యాకేజీ ప్రకటించింది. రెండు రాత్రులు, ఒక పగలు సాగే ఈ టూర్‌ను ఏసీ, నాన్ ఏసీ ప్యాకేజీలుగా విభజించింది. ఏసీ బస్సులో ప్రయాణానికి పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010 గా టికెట్ ధరలు ఖరారు చేసింది. నాన్ ఏసీ బస్సులో ప్రయాణించాలంటే పెద్దలు రూ.2,400, పిల్లలకు రూ.1,970 గా టికెట్ ధర నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని వివిధ పికప్ పాయింట్ల నుంచి సాయంత్రం బస్సులు బయలుదేరుతాయి. దిల్‌షుక్‌నగర్, బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, కేపీహెచ్ బీ, మియాపూర్ పికప్ పాయింట్ల నుంచి బస్సులు సాయంత్రం షిర్డీకి బయలుదేరతాయని పేర్కొంది. అయితే, ఈ టూర్‌లో బాబా దర్శన టికెట్ సదుపాయాన్ని మాత్రం చేర్చలేదు. అంటే బాబా దర్శనం కోసం ముందుగానే భక్తులు టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. మధ్యహ్న భోజనం ఏర్పాట్లు కూడా భక్తులు తమ సొంతంగా ఖర్చు చేసుకోవాలి. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు https://tourism.telangana.gov.in/package/ShirdiTour ను సందర్శించాలని అధికారులు సూచించారు.
Also Read..
సమ్మర్‌లో లడఖ్ అందాలు చూడాలనుకుంటున్నారా.. అయితే IRCTC స్పెషల్ ప్యాకేజీ మీకోసమే!