- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana Thalli : సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం.. పనులు పరిశీలించిన సీఎం రేవంత్
దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముమ్మర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఇవాళ సచివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పనులు ఎంతవరకు వచ్చాయో ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆయన ఇంటికి వెళ్లి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తారని ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల యాప్ లాంచ్ సందర్భంగా సెక్రటేరియట్‌లో సీఎం మాట్లాడారు.
కాగా, విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు చేయనున్నారు. భారీ డ్రోన్, లేజర్, క్రాకర్స్ షోలు నిర్వహిస్తున్నారు. ఏడో తేదీన వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లీగంజ్, 9న థమన్‌తో సినీ సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9వ తేదీన తెలుగు తల్లి ఫ్లయ్ ఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి వివిధ కళారూపాలు ప్రదర్శించనున్నారు. ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్స్ సహా వివిధ శాఖలకు చెందిన 120 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. యూత్ కోసం సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశముంది.. కాబట్టి తాగునీరు, టాయిలెట్లు, భద్రత ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం సహా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.