ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం...

by Anjali |   ( Updated:2023-03-20 14:25:04.0  )
ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం...
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి 23న(రంజాన్ మాసం ప్రారంభం) ముస్లిం ఉద్యోగులకు ఊరట కల్పించింది. విధుల నుంచి ఉద్యోగులు ఇంటికి 1 గంట ముందు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు సాయంత్రం 4 గంటలకు వీలు కల్పించింది. అంతేగాక, పండుగరోజు ముస్లింలకు బహుమతులు ఇస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed