తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: CS శాంతికుమారి

by Satheesh |   ( Updated:2023-01-11 13:59:09.0  )
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: CS శాంతికుమారి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతికుమారి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని.. వాటిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నమ్మకంతో అప్పగించిన బాధ్యతను, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తాని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story