- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణికులపై ఛార్జీల మోత.. ఆర్టీసీ సైలెంట్ వ్యూహం
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ చార్జీలను వ్యూహత్మకంగా పెంచుతున్నది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ సైలెంట్‌గా అమలు చేస్తున్నది. గతంలో చార్జీలు పెంచితే దానికి గల కారణాలను ప్రభుత్వం నుంచి సీఎం లేదా మంత్రిస్థాయిలో అఫీషియల్‌గా ప్రకటించేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సర్కార్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో వ్యతిరేక మరక అంటుకుంటుందనే భయంతో తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.
మౌనంతోనే ఆమోదం
రాష్ట్రంలో ఇటీవల వరుసగా చార్జీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చార్జీల సవరణ అంటూ ఆర్టీసీ కొంతమేరకు టికెట్ ధరలను పెంచింది. వీటికి కేవలం సవరణ మాత్రమే అంటూ ఆర్టీసీ ఎండీ సిబ్బందికి చెప్పుకొచ్చారు. రౌండప్ పేరిట రూ.5 వరకు చార్జీలను సవరించినప్పటికీ వాస్తవానికి చాలా రూట్లలో చార్జీలు పెరిగాయి. తాజాగా మరోసారి టికెట్ రూపంలో ప్రయాణికులను బాదేశారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ఒక్కో టికెట్‌పై ప్యాసింజర్ సెస్ రూ. 5-10 వరకు విధించారు. దీనిపై ఆర్టీసీ ఎండీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచే అమల్లోకి తీసుకున్నారు. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వివిధ రూపాల్లో నుంచి ఆర్టీసీ ఆదాయం రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.10 చొప్పున పెంచారు. తాజాగా హైదరాబాద్ పరిధిలో బస్ పాసుల ధరలను సైతం ఆర్టీసీ పెంచింది.
సిటీ బస్ పాస్ ధరల పెంపు
సిటీ బస్ పాస్ ల ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. ఆర్డీనరీ పాస్ ధర రూ. 970 నుంచి రూ. 1,150, మెట్రో ఎక్స్ ప్రెస్ కు సంబంధించి 1,070 నుంచి 1,300కు మెట్రో డీలక్స్ పాస్ ధరను 1,185 నుంచి 1,450కి పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పాస్ ధరను 1,100 నుంచి 1,350కి పెంచింది. పుష్పక్ ఏసీ పాస్ రేటును 2,500 నుంచి 3 వేలకు పెంచింది. కొత్తరేట్లు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రిజర్వేషన్ చార్జీలు సైతం
రిజర్వేషన్ చార్జీలను సైతం ఆర్టీసీ పెంచింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ చార్జీ రూ. 20 వసూలు చేస్తుండగా దానిని రూ. 30కి పెంచారు. త్వరలోనే సమాచార సెస్‌ను కూడా విధించనున్నారు. బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ సెస్ పేరిట ఒక్కో టిక్కెట్‌పై రూ. 1-5 వరకు చార్జీలు పెరిగే అవకాశం ఉంది.