- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Rice : తెలంగాణ బియ్యం.. ఇక మలేషియాకు ఎగుమతి
దిశ, వెబ్ డెస్క్ : ఇకపై తెలంగాణ బియ్యం(Telangana Rice) మలేషియాకు ఎగుమతి కానున్నాయి. తెలంగాణ బియ్యాన్ని తాము దిగుమతి చేసుకుంటామని మలేషియన్ దిగుమతి దారులు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar babu)కు హామీ ఇచ్చారు. ఆదివారం కౌలాలంపూర్లో జరిగిన మలేషియా (బిజినెస్ మీట్Malaysia Bussiness Meet) కు ఆయన హాజరయ్యి మలేషియా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణలో సాగుచేస్తున్న వరి, ధాన్యం రకాలు, నాణ్యత, తదితర అంశాల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య వివరించారు. దీనిపై స్పందించిన దిగుమతి దారులు తెలంగాణ బియ్యాన్ని తాము దిగుబడి చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతోపాటు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ కుమార్, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.