- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు.. మద్యం వినియోగంలో తెలంగాణ రెండో స్థానం
దిశ, తెలంగాణ బ్యూరో: మరే వస్తువు కన్నా మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఎక్కువగా విధిస్తున్నది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం.. గతేడాది మద్యం అమ్మకాల విలువ రూ.30,783.33 కోట్లు. అయితే ఎక్సయిజ్ డ్యూటీ, ఎక్సైజ్ పన్ను, ఇతరాలు, సీఎంఆర్ఎఫ్, వ్యాట్ రూపంలో వసూలు చేసింది 31,343 కోట్ల రూపాయలు కావడం విశేషం. ఇతర వస్తువుల కన్నా ఎక్కువగా పన్నులు విధించిన కారణంగా ప్రభుత్వానికి రూ. 560 కోట్లు ఆదాయం అధికంగా వచ్చింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఖజానాను లిక్కర్ కిక్కు, గ్లాసుల గలగల కళకళలాడిస్తున్నది. వినియోగంతో పాటు విక్రయాలూ పెరిగాయి. దీంతో ఆదాయం ఎనిమిదేండ్లలో మూడు రెట్లు గెయిన్ అయ్యింది. మద్యం వినియోగంలో దేశం మొత్తం మీద తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. అరుణాచల్‌ప్రదేశ్ (53%) తర్వాత ఎక్కువగా మద్యం వినియోగమవుతున్నది తెలంగాణ (43%)లోనే. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మద్యం విక్రయాల ద్వారా రూ. 10,238 కోట్లు సమకూరితే గతేడాదిలో ఇది రూ. 31,343 కోట్లకు పెరిగింది. 2014-15లో సుమారు 2.02 కోట్ల లిక్కర్ కేసుల విక్రయం జరిగితే గతేడాది అది 3.71 కోట్ల కేసులకు చేరుకున్నది. లిక్కర్, బీరు ధరలను పరిగణనలోకి తీసుకుంటే అసలు ధర కన్నా వాటిమీద విధించిన ఎక్సయిజ్, వ్యాట్ ద్వారానే ఎక్కువగా సమకూరుతున్నట్లు తేలింది.
సీఎంఆర్ఎఫ్‌కు ఏటా రూ.300 కోట్లు!
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆర్జిస్తున్న పన్నుల ఆదాయంలో సగటున 20% మద్యం ద్వారానే లభిస్తున్నది. ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా సగటున సంవత్సరానికి రూ. 300 కోట్లపైనే చేరుతున్నది. ఈ సంవత్సరం మద్యం ధరలను యావరేజ్‌గా 25% పెంచినందున వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రభుత్వ బడ్జెట్ లెక్కల కన్నా ఎక్కువగానే సమకూరే అవకాశం ఉన్నది. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ఎక్సయిజ్ పన్నుల ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్నే ప్రభుత్వం ఆ పద్దు కింద లెక్కల్లో చూపుతుంది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (సేల్స్) రూపంలో విధించే పన్ను వివరాలను విడిగా పేర్కొనదు. దీంతో లిక్కర్ అమ్మకాల ద్వారా నిర్దిష్టంగా ఖజానాకు ఎంత చేరుతున్నదనే వివరాలు బడ్జెట్ లెక్కల్లో డైరెక్టుగా కనపడవు.
ఆదాయ సమీకరణకు మార్గాల అన్వేషణ
ఈ సంవత్సరం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రిజర్వుబ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ రూపంలో తీసుకునే మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. వివిధ రకాల ద్రవ్య సంస్థల నుంచి ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే అప్పులకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో సొంత ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. దీని ప్రభావం మద్యంపైనే ఎక్కువగా పడింది. భూముల విలువ పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచింది. వాహనాలపై పన్నులనూ హైక్ చేసింది. రాజీవ్ స్వగృహ భూములు, ప్లాట్లను అమ్ముకోవడం, హెచ్ఎండీఏ స్థలాలను వేలంవేయడం తదితరాలతో పాటు మద్యం ధరలనూ 25% పెంచింది. వీలైనంత ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగేందుకు వైన్ షాపులు, బార్ల సంఖ్యను కూడా పెంచింది. కొత్తగా నెలకొల్పుకోడానికి లైసెన్సులు మంజూరు చేసింది. గ్రామాల్లో పబ్లిక్‌గానే బెల్టు షాపులు నడుస్తున్నా రెవెన్యూ సమకూరుతుందన్న ఉద్దేశంతో ఎక్సయిజ్ సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు దసరా పండుగ, మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకుని సేల్స్ పెంచాల్సిందిగా ఎక్సయిజ్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి తగినట్లుగానే ఉత్పత్తి, సరఫరా పెంచాల్సిందిగా డిస్టిలరీలు, డిపోలను ఆదేశించింది.
మద్యం వినియోగంపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2019-21 మధ్యకాలంలో అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం జరగ్గా 15 ఏళ్ళ వయసు పైబడిన వారు మద్యం సేవించడంలో అరుణాచల్‌ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే ఆ తర్వాతి స్థానం తెలంగాణదేనని తేలింది. పట్టణ ప్రాంతాల్లోకన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే పురుషులు, మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్టు తేలింది. తెలంగాణలో గ్రామీణ పురుషులు సుమారు 49.1% మంది మద్యం వినియోగిస్తుండగా పట్టణాల్లో ఇది 34%గా నమోదైంది. మహిళలు సైతం గ్రామాల్లోనే (9.1%) మద్యం తాగుతున్నారు. మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో మద్యం (బీరు కాకుండా లిక్కర్) వినియోగం (లక్షల కేసులు)
సేల్స్ (బీరు, లిక్కర్ కలిసి విలువ), పన్నులు విధించిన తర్వాత ప్రభుత్వానికి వస్తున్న ఆదాయా (కోట్లరూ.లలో)న్ని పరిశీలిస్తే..