- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొన్న 'హ్యాక్ ఐ' నేడు 'టీఎస్ కాప్'... తెలంగాణ పోలీస్ మరో యాప్ హ్యాక్
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. ఇటీవలే తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం మరువక ముందే ఇప్పుడు టీఎస్ సీఓపీ (రియల్ టైమ్ పోలిసింగ్) యాప్ ను సైతం సైబర్ నేరగాళ్లు యాక్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ యాప్ లోని రాష్ట్ర పోలీసులకు సంబంధించిన డేటాని 120 డాలర్లకు ఆన్ లైన్ లో ప్రకటనలు సైతం ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ రెండు యాప్ లలో దాదాపు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉండగా ఇప్పుడీ సమాచారం అంతా బహిరంగంగా విక్రయానికి ఉంచడం కలకలం రేపుతోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ హ్యాకింగ్ కు పాల్పడుతున్న కేటుగాళ్లను పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇక వరుసగా పోలీసులకు చెందిన యాప్ లు హ్యాకర్ల బారిన పడుతుండటంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే మీ డివైజ్ కు బలమైన పాస్ వర్డులు పెట్టుకోవాలని నమ్మకమైన సాఫ్ట్ వేర్ లను ఉపయోగించాలని అందరికి చెప్పే మీరే అలా చేయకపోవడం ఏంటో అంటూ సెటర్లు వేస్తున్నారు. గతంలో సిటీ పోలీసులు చేసిన ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.