- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆంధ్రలో బర్త్ డే చేసుకున్న తెలంగాణ ఎంపీ
దిశ,ఏపీ బ్యూరో: తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పర్యటించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బెజవాడను వంగవీటి గడ్డగా అభివర్ణించారు ఎంపీ ధర్మపురి అర వింద్. ఒక అభిమానిగా తన అభిమానాన్ని చాటుకున్నానని, అందుకే వంగవీటి గడ్డ అని అన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ప్రధాని మోదీ మీద ఎంత అభిమానం ఉందో... అదే అభిమానం వంగవీటి మీద ఉందన్నారు. విజయవాడ వచ్చి తన అభిమానాన్ని చాటుకోపోతే ఎలా అని వ్యాఖ్యానించారు. చైతన్యం, ఆతిథ్యం, దాతృత్వం, అమృత్వం అన్నీ కలిస్తే విజయవాడ అన్నారు. ఇక తెలుగు రాష్ట్రల్లో లేటెస్ట్ రాజకీయాలపై బీజేపీ ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంఐఎం చేతుల్లో ఉన్నట్టుగా అసదుద్దీన్ కామెంట్లు చేస్తున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లను మంత్రులు తప్పు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తామంతా గల్లీలో సైనికులమని, ఢిల్లీలో చాణుక్యులున్నారన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలతో బీజేపీ సమదూరమే పాటిస్తుందని తెలిపారు.