- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పత్రిక ది ఎకనామిస్ట్ తెలంగాణ మోడల్ గురించి గొప్పగా ప్రచురించిందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త రాష్ట్రాలను సృష్టించేందుకు తెలంగాణను విజయవంతమైన నమూనాగా సూచించిందని పేర్కొన్నారు. కేసీఆర్ సమర్థ పరిపాలనలో గడచిన దశాబ్దంలో తెలంగాణ అద్భుత అభివృద్ధిని సాధించిందని ది ఎకనామిస్ట్ పేర్కొందన్నారు. తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 జీ.డబ్ల్యూ నుంచి 19.3 జీ.డబ్ల్యూకి పెరిగిందన్నారు.
ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 మధ్య నాలుగు రెట్లు ఎక్కువ పెరిగి 2.4 ట్రిలియన్ల రూపాయలు ఉందన్నారు. ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 9,00,000కి చేరుకున్నాయని, రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలోపు జాతీయ జీడీపీకి సహకారం 4.1% నుంచి 4.9%కి పెరిగిందని పత్రికలో నొక్కి చెప్పిందన్నారు. అయితే, కొత్త పాలకులు బీఆర్ఎస్ నియమానికి వ్యతిరేకంగా తమ స్మెర్ ప్రచారాన్ని నిలిపివేస్తారని, ఈ గ్రోత్‌ను అడ్డంకులు లేకుండా ఉండేలా తీసుకపోతారని ఆశిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.
తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం
ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు 38 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ తాజాగా మరో ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చీప్ మద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని భావిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.