- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లెక్క తేల్చండి.. జలశక్తి కార్యదర్శికి తెలంగాణ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడినా నీటి వాటాల విషయంలో ఇప్పటికీ న్యాయం జరగడంలేదని, ట్రిబ్యునల్‌కు అధికారాలు ఇచ్చి పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపు జరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకుండా ప్రతీ ఏటా తాత్కాలిక పద్ధతిన కేటాయింపులతోనే సరిపెడుతున్నదని పేర్కొన్నది. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన పరస్పర అవగాహనా ఒప్పందం ప్రకారం సమైక్య రాష్ట్రానికి లభించిన 811 టీఎంసీల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల చొప్పున కేటాయింపులు జరిగాయని కేంద్ర జలశక్తి కార్యదర్శికి రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా న్యాయమైన వాటాను పొందే హక్కు తెలంగాణకు ఉన్నదని గుర్తుచేశారు. ఈ హక్కును సాధించుకోడానికి అంతర్ రాష్ట్ర నీటి వివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద తెలంగాణ ప్రభుత్వం 2014లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని పేర్కొన్నారు. కానీ కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన 2020 అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశంలో తెలంగాణకు స్పష్టమైన విజ్ఞప్తి చేసి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్‌కు అప్పగిస్తామన్న హామీ ఇచ్చారని, అది ఇప్పటికీ నెరవేరలేదని ఆ లేఖలో గుర్తుచేశారు. ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్-2 ఇంకా ఉనికిలోనే ఉన్నదని, వెంటనే దానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తెలంగాణ నీటి వాటాపై తేల్చాలని ఆ లేఖలో కోరారు.
కేవలం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించే అధికారం ఉన్నదని రజత్ కుమార్ గుర్తుచేశారు. కృష్ణా నదిలో 75% నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 574.6 టీఎంసీల వాటా దక్కాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలో కృష్ణా బోర్డుకు కూడా తెలియజేశామని, కానీ బోర్డు అధికారులు మాత్రం తమ పరిధిలో లేదంటూ సమాధానమిచ్చారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఖరారు చేయడానికి ట్రిబ్యునల్‌కు ఈ అంశాన్ని బదిలీ చేయాలని కోరారు.